వార్తలకు తిరిగి వెళ్లండి
ఐదేళ్లలో గ్రామ పంచాయతీలకు వాతావరణ సూచనలు

ఐదేళ్లలో వాతావరణ సూచనలను గ్రామ పంచాయతీ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని కేంద్ర భూవిజ్ఞాన శాఖ కార్యదర్శి తుమ్మల శ్రీనివాస కుమార్ తెలిపారు. దేశంలో వెదర్ రాడార్ల సంఖ్యను 132కి పెంచనున్నట్లు చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త రాడార్లు ఏర్పాటు చేయనున్నారు. వాతావరణ అంచనాల్లో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...
