Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 ఎకరాల ఆయిల్‌పామ్ తోట దగ్ధం

Kiran Nov 13, 2026 9:57 AM నారాయణపేటGeneral
Add as a preferred source on Google
10 ఎకరాల ఆయిల్‌పామ్ తోట దగ్ధం - Ushodayam
నర్వ మండలం రాయికోడ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 ఎకరాల ఆయిల్‌పామ్ తోట దగ్ధమైంది. గ్రామానికి చెందిన డి. రాజు, డి. శ్రీనివాసులు ఐదేళ్ల క్రితం సాగు చేసిన ఈ తోట మరో రెండు రోజుల్లో కోతకు రావాల్సి ఉంది. మంటల ధాటికి పంటతో పాటు బిందు సేద్యం పరికరాలు, నీటి పైపులు, ఎరువుల ఫిల్టర్లు కాలిపోయి లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...