Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేటలో ఆజాద్‌కు ఘన నివాళులు

Anuroop Nov 12, 2026 9:15 AM నాగర్ కర్నూల్General
Add as a preferred source on Google
అచ్చంపేటలో ఆజాద్‌కు ఘన నివాళులు - Ushodayam
విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమని, విద్యార్థులు ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ప్రిన్సిపల్ జె. రాములు అన్నారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా బుధవారం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన జీవిత విశేషాలు, విద్యారంగానికి చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ పోటీలు నిర్వహించారు.

Comments

G
Loading comments...