వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్టీసీ బస్సు ఢీకొని తొమ్మిదేళ్ల బాలుడి మృతి

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మోతుగూడ వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొని చౌదరి వర్షిత్ (9) అనే ఐదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్న పల్లె వెలుగు బస్సు ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలుడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...
