Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలసలో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి

Anuroop Nov 13, 2026 10:35 AM శ్రీకాకుళంGeneral
Add as a preferred source on Google
ఆమదాలవలసలో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి - Ushodayam
ఆమదాలవలసలో శుక్రవారం నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పుట్టల వద్దకు చేరుకొని నాగేంద్రుడికి పాలు పోసి, చలిమిడి, వడపప్పును నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పుట్టల వద్ద భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...