వార్తలకు తిరిగి వెళ్లండి
ఆజాద్ సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వాడపాలెంలోని తన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆజాద్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. ఆజాద్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...
