వార్తలకు తిరిగి వెళ్లండి
ఆది శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని పూజలు

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాలికి గాయం కావడంతో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ వేములవాడ అర్బన్ మండలం ఆరెపల్లిలోని భక్త ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ప్రార్థించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇటిక్యాల రాజు, ఇటిక్యాల లింగయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సిలువేని మల్లేశం, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
