వార్తలకు తిరిగి వెళ్లండి
13న మరో అల్పపీడనం.. వర్ష సూచనలు

బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది.
ప్రస్తుతం ఈశాన్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీయవచ్చని వెల్లడించింది.
Comments
Loading comments...
