వార్తలకు తిరిగి వెళ్లండి
10 రోజులుగా నీటిలోనే 13 రోడ్లు

వాకలపూడిలోని వినాయక రామకృష్ణ నగర్ కాలనీలో ముంపు సమస్య పరిష్కరించాలని స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పది రోజులుగా 13 రోడ్లు జలమయమయ్యాయని, విషపురుగుల బెడదతో ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
150 ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదని, పంచాయతీ ఈవో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ముంపు నీటిని తొలగించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
