Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షంతో భారత్‌-కివీస్‌ ‘ఎ’ మ్యాచ్‌ డ్రా

Sai Nath Nov 10, 2026 5:09 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
వర్షంతో భారత్‌-కివీస్‌ ‘ఎ’ మ్యాచ్‌ డ్రా - Ushodayam
భారత్‌-న్యూజిలాండ్‌ ‘ఎ’ జట్ల మధ్య మూడో అనధికారిక టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. నాలుగో రోజు మంగళవారం ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దయింది. తొలి రెండు మ్యాచ్‌లు కూడా డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 464 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. యశస్వి జైస్వాల్‌ (102), సాయి సుదర్శన్‌ (88), తిలక్‌ వర్మ (81 నాటౌట్‌), ధ్రువ్‌ జురెల్‌ (71) రాణించారు.

Comments

G
Loading comments...