Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తొలి టెస్టులో 368 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్‌

Anuroop Nov 20, 2026 7:52 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
తొలి టెస్టులో 368 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్‌ - Ushodayam
భారత్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 368 పరుగుల వద్ద ఆలౌటైంది. హెన్రీ నికోలస్ 175 (335 బంతుల్లో), గ్లెన్ ఫిలిప్స్ 118 (216 బంతుల్లో) పరుగులతో జట్టును ఆదుకున్నారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా, ఆకాశ్ దీప్ మూడు, కుల్దీప్ కాంబోజ్ రెండు, ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీశారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగనుంది.

Comments

G
Loading comments...