వార్తలకు తిరిగి వెళ్లండి
రుతురాజ్‌పై వేటు.. మళ్లీ పృథ్వీ షాకు కెప్టెన్సీ

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026లో మహారాష్ట్ర జట్టుకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌కు రుతురాజ్ గైక్వాడ్‌ను తుదిజట్టు నుంచి తప్పించి పృథ్వీ షాకు మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రాహుల్ త్రిపాఠిని కూడా బెంచ్‌కే పరిమితం చేశారు.
రుతురాజ్ మూడు ఇన్నింగ్స్‌ల్లో 62 పరుగులే చేయడంతో అతడిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...
