వార్తలకు తిరిగి వెళ్లండి
రబాడ అరుదైన ఘనత.. చరిత్ర సృష్టి

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడ చెలరేగాడు. తొలి బంతికే వికెట్ తీసిన అతడు, వరుస ఓవర్లలో మరో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు 11 ఓవర్లలో 33 పరుగులిచ్చి ఐదు వికెట్లు సాధించాడు.
ఈ ప్రదర్శనతో టెస్టుల్లో తొలి బంతికే వికెట్ తీసిన నాలుగో దక్షిణాఫ్రికా బౌలర్‌గా నిలిచాడు. అలాగే 18వసారి ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు.
Comments
Loading comments...
