వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రేమ వ్యవహారంతో కూతురిని చంపిన తండ్రి

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామంలో మేనత్త కొడుకును ప్రేమించిందనే కారణంతో 18 ఏళ్ల కళ్యాణిని తండ్రి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. గొంతు నులిమి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఉరికి వేలాడదీసినట్లు వెల్లడైంది.
మూడు గంటల్లోనే అంత్యక్రియలు పూర్తి చేయడం, లంబాడ సంప్రదాయాలకు విరుద్ధంగా దహనం చేయడంతో అనుమానాలు వచ్చాయి. విచారణలో కళ్యాణిని తానే చంపినట్లు తండ్రి అంగీకరించినట్లు సమాచారం.
Comments
Loading comments...
