Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లో భక్తులతో కిటకిటలాడిన ఆలయం

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 1:23 PM నిర్మల్ General
నిర్మల్‌లో భక్తులతో కిటకిటలాడిన ఆలయం - Ushodayam
విజయదశమి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని బంగల్‌పేట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ సభ్యులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...