వార్తలకు తిరిగి వెళ్లండి
లాస్ వెగాస్ గ్రాండ్ ప్రి విజేతగా మాక్స్ వెర్‌స్టాపెన్

ఫార్ములావన్ లాస్ వెగాస్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను రెడ్‌బుల్ రేసర్ మాక్స్ వెర్‌స్టాపెన్ కైవసం చేసుకున్నాడు. గంటా 27 నిమిషాల 39.624 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానం సాధించిన అతడు, గత నాలుగేళ్లలో ఇక్కడ మూడోసారి విజేతగా నిలిచాడు.
ఉత్కంఠభరితంగా సాగిన రేసులో జార్జ్ రసెల్, లాండో నోరిస్ నుంచి గట్టి పోటీ ఎదురైనా వెర్‌స్టాపెన్ 0.639 సెకన్ల స్వల్ప తేడాతో నోరిస్‌ను వెనక్కినెట్టి టైటిల్ ఎగరేసుకుపోయాడు.
Comments
Loading comments...
