వార్తలకు తిరిగి వెళ్లండి

కోటగిరిలో ఇంటి పన్నుల వసూళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. సర్పంచ్ మధుకర్ వసూళ్లను పరిశీలించి, పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల కల్పనకు పన్నులు కీలకమని తెలిపారు.
గ్రామాభివృద్ధికి ఇంటి పన్నులను సకాలంలో చెల్లించి సహకరించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సందీప్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

