Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కండక్టర్‌పై దాడికి నిరసనగా ఆర్టీసీ కార్మికుల ఆందోళన

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 11:01 AM ఖమ్మంGeneral
కండక్టర్‌పై దాడికి నిరసనగా ఆర్టీసీ కార్మికుల ఆందోళన - Ushodayam
మణుగూరు డిపో మహిళా కండక్టర్‌ ప్రవళికపై ప్రయాణికురాలు దాడి చేసిన ఘటనను నిరసిస్తూ సోమవారం మధిర ఆర్టీసీ డిపో జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. విధులకు హాజరైన కార్మికులు మొదటి బస్సు నుంచే నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రవళికకు మెరుగైన వైద్యం అందించాలని, మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...