వార్తలకు తిరిగి వెళ్లండి
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత యువ జట్టు ప్రకటన

ఇంగ్లండ్‌తో నవంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత మహిళల అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది. వికెట్ కీపర్ భవికా అహిరే జట్టుకు కెప్టెన్‌గా, అనాది తగ్డే వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ సిరీస్ 2027 అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఉపయోగపడనుంది.
తొలి రెండు మ్యాచ్‌లు వడోదరలో, మిగిలిన మూడు మ్యాచ్‌లు సూరత్‌లో జరగనున్నాయి.
Comments
Loading comments...
