Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కు నీటి కష్టాలు.. జలాశయాల్లో అడుగంటిన నిల్వలు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 10:45 AM హైదరాబాద్General
హైదరాబాద్‌కు నీటి కష్టాలు.. జలాశయాల్లో అడుగంటిన నిల్వలు - Ushodayam
ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలు పెరిగే అవకాశముంది. మంజీరా, సింగూరు జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. సింగూరులో 3.029 టీఎంసీలు, మంజీరాలో 0.19 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుత నిల్వలు మరో 60 రోజులకు మాత్రమే సరిపోతాయని జలమండలి అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. నగరంలో ప్రస్తుతం రెండు రోజులకు ఒకసారి 40-45 నిమిషాల పాటు నీటి సరఫరా చేస్తున్నారు.

Comments

G
Loading comments...