వార్తలకు తిరిగి వెళ్లండి
66 పరుగులకే ఆలౌట్ చేసి.. విజయంతో ముగించిన అఫ్గానిస్తాన్

ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్-2026 టోర్నీలో అఫ్గానిస్తాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. సోమవారం దోహాలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో హాంకాంగ్-చైనాను కేవలం 66 పరుగులకే ఆలౌట్ చేసి, ఆపై 10.2 ఓవర్లలోనే ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకుంది.
అంతకుముందు శ్రీలంక, బంగ్లాదేశ్ చేతిలో ఓడటంతో అఫ్గాన్ ఇప్పటికే సెమీస్ రేసు నుంచి ఎలిమినేట్ అయింది.
Comments
Loading comments...
