Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితికి డీజే నిబంధనలు తప్పనిసరి: బాపట్ల డీఎస్పీ

Follow Ushodayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 11, 2026 6:20 PM బాపట్లGeneral
వినాయక చవితికి డీజే నిబంధనలు తప్పనిసరి: బాపట్ల డీఎస్పీ - Ushodayam
వినాయక చవితి సందర్భంగా డీజే యజమానులు పోలీసు నిబంధనలను విధిగా పాటించాలని బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి ఆదేశించారు. శుక్రవారం సీఐ రాంబాబుతో కలిసి డీజే నిర్వాహకులకు అవగాహన సమావేశం నిర్వహించారు. రాత్రి పూట డీజేలను నిషేధించామని, పరిమిత శబ్దంతోనే సౌండ్ సిస్టమ్స్ వాడాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...