వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామికవాడలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్ గోదాములో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ప్లైవుడ్ గోదాముకు వ్యాపించాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు గోదాముల్లో ఉన్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Comments
Loading comments...

