Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకలకు అనుమతులు తప్పనిసరి: సంతకవిటి ఎస్సై

Follow Ushodayam on Google
B Ganga Sep 06, 2026 5:19 PM పార్వతీపురం మన్యంGeneral
వినాయక చవితి వేడుకలకు అనుమతులు తప్పనిసరి: సంతకవిటి ఎస్సై - Ushodayam
సంతకవిటి మండలంలో వినాయక చవితి వేడుకలకు విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని ఎస్సై గోపాలరావు తెలిపారు. నిమజ్జన సమయంలో డీజేలకు అనుమతి లేదని, అధిక శబ్దాలతో ప్రజలకు ఇబ్బంది కలిగించరాదని, బలవంతంగా చందాలు వసూలు చేయడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం చేయరాదన్నారు. నిమజ్జన తేదీ, సమయం, మార్గం, ప్రదేశ వివరాలు ఇవ్వడంతోపాటు మండపాల వద్ద రాత్రివేళ ఇద్దరు కాపలా ఉండాలన్నారు.

Comments

G
Loading comments...