Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుపాను ముప్పును సమర్థంగా ఎదుర్కోవాలి: సీఎం చంద్రబాబు

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 9:05 PM అమరావతిGeneral
తుపాను ముప్పును సమర్థంగా ఎదుర్కోవాలి: సీఎం చంద్రబాబు - Ushodayam
అర్నబ్‌ తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నెల 28న తుపాను తీరం దాటే అవకాశముండటంతో అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. సహాయక చర్యలకు 10 ఎన్డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచారు.

Comments

G
Loading comments...