Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టికెట్‌ వివాదం.. ఎంపీ ఇంటివద్ద జనసేన నాయకుల ఆందోళన

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 10:10 AM కాకినాడGeneral
టికెట్‌ వివాదం.. ఎంపీ ఇంటివద్ద జనసేన నాయకుల ఆందోళన - Ushodayam
పెద్దాపురం జడ్పీటీసీ అభ్యర్థిగా అంబటి శివరాణికి టికెట్‌ కేటాయించడంతో జనసేనలో అసంతృప్తి వ్యక్తమైంది. తొలుత టికెట్‌ హామీతో నామినేషన్‌ వేసిన గుడివాడకు చెందిన అంబటి గంగాధర్‌కు చివరి నిమిషంలో టికెట్‌ నిరాకరించడంతో ఆయన అనుచరులతో కలిసి ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌ ఇంటి ముందు బైఠాయించారు. పెట్రోల్‌ క్యాన్‌తో నిరసన తెలిపిన గంగాధర్‌, పార్టీ కోసం పనిచేసిన నాయకులకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...