Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారీ

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 9:58 AM జాతీయంGeneral
జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారీ - Ushodayam
తమిళనాడులోని తేని జిల్లా సబ్‌జైల్‌ నుంచి సోమవారం అర్ధరాత్రి 17 మంది ఖైదీలు పరారయ్యారు. మూర్ఛ వచ్చినట్లు నటించి సిబ్బంది గదిలోకి రాగానే దాడి చేసి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. గాయపడిన సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. పరారైన వారిలో ఒకరిని పోలీసులు తిరిగి అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం 17 బృందాలతో గాలింపు చేపట్టారు. తేని నుంచి దిండిగల్‌ వరకు హైఅలర్ట్ ప్రకటించి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...