వార్తలకు తిరిగి వెళ్లండి
తల్లి కళ్లెదుటే బాలుడి సజీవ దహనం

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం బలపాలతిప్పలో విషాద ఘటన చోటుచేసుకుంది. పూరింటికి అమర్చిన సోలార్ ప్యానెల్ బ్యాటరీ పేలడంతో మంటలు చెలరేగి ధర్మతేజ (5) అనే బాలుడు సజీవ దహనమయ్యాడు. తల్లి, స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఈ ప్రమాదంలో ఇంట్లోని బియ్యం, ఇతర వస్తువులు కలిపి సుమారు రూ.లక్ష ఆస్తినష్టం వాటిల్లింది. బాధిత కుటుంబానికి తహసీల్దారు ఉషారాణి తక్షణ సాయంగా రూ.5వేలు అందజేశారు.
Comments
Loading comments...
