Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిలారు అండర్‌పాసేజ్‌లో వర్షపు నీరు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:30 PM శ్రీకాకుళంGeneral
తిలారు అండర్‌పాసేజ్‌లో వర్షపు నీరు - Ushodayam
జలుమూరు మండలం తిలారు ప్రధాన రహదారిలోని రైల్వే అండర్‌పాసేజ్ వర్షపు నీటితో నిండిపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నీరు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితి పలుమార్లు ఎదురవుతున్నా రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. నీరు బయటకు వెళ్లే మార్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...