Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షేకుపల్లిలో అంబరాన్నంటిన దసరా సంబరాలు

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 11:45 AM జోగులాంబ గద్వాల్ General
షేకుపల్లిలో అంబరాన్నంటిన దసరా సంబరాలు - Ushodayam
ఇటిక్యాల మండలం షేకుపల్లిలో వారం రోజులుగా నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శివ రామాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవిని ప్రతిష్ఠించి మహిళలు ప్రతిరోజూ బొడ్డెమ్మ, జడకోలాటం, బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో లయబద్ధంగా నృత్యాలు చేస్తూ తమ ప్రతిభను చాటుతున్నారు. సంప్రదాయ వేడుకలతో గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు జీవం పోస్తున్నారు.

Comments

G
Loading comments...