Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కార్మికులకు రూ.1.10 లక్షల వరకు బోనస్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:38 PM హైదరాబాద్General
సింగరేణి కార్మికులకు రూ.1.10 లక్షల వరకు బోనస్‌ - Ushodayam
సింగరేణి కార్మికులకు గరిష్ఠంగా రూ.1,10,250 దీపావళి బోనస్‌ ప్రకటించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సుమారు 38 వేల మందికి రూ.419 కోట్లు విడుదల చేయనున్నారు. నవంబరు 5న ఖాతాల్లో జమయ్యే అవకాశముంది. గత ఆర్థిక సంవత్సరంలో కనీసం 30 రోజులు పనిచేసిన కార్మికులు అర్హులు. పని దినాల ఆధారంగా బోనస్‌ చెల్లిస్తారు. జాతీయ బొగ్గు వేతన ఒప్పందం పరిధిలోని కార్మికులకే ఇది వర్తిస్తుంది. అధికారులకు వర్తించదు.

Comments

G
Loading comments...