Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షణ కొనుగోళ్లకు రూ.2.12 లక్షల కోట్లు

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 6:36 PM జాతీయంGeneral
రక్షణ కొనుగోళ్లకు రూ.2.12 లక్షల కోట్లు - Ushodayam
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాయుధ దళాల కొనుగోళ్లకు రూ.2.12 లక్షల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వీటిలో 82 శాతం కొనుగోళ్లు భారత పరిశ్రమల నుంచే చేపట్టనున్నారు. సైన్యం, నౌకాదళం, వాయుసేన కోసం హెలికాప్టర్లు, డ్రోన్లు, ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. ఈ పరికరాలు నిఘా, రవాణా, యుద్ధ సామర్థ్యాలను పెంచనున్నాయి.

Comments

G
Loading comments...