Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేవంత్‌ పర్యటనతో కేఆర్‌ఎంబీ భేటీ వాయిదా

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 7:10 PM హైదరాబాద్General
రేవంత్‌ పర్యటనతో కేఆర్‌ఎంబీ భేటీ వాయిదా - Ushodayam
ఈ నెల 26న జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) 21వ సమావేశం వాయిదా పడింది. తుమ్మిడిహెట్టి అంశంపై చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అదే రోజు ముంబయి వెళ్లనున్న నేపథ్యంలో సమావేశానికి హాజరుకాలేమని తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ బోర్డుకు లేఖ రాశారు. తెలంగాణ విజ్ఞప్తితో సమావేశాన్ని వాయిదా వేసిన కేఆర్‌ఎంబీ.. తదుపరి భేటీని ఈ నెల 27న నిర్వహించనున్నట్లు తెలిపింది.

Comments

G
Loading comments...