వార్తలకు తిరిగి వెళ్లండి
దీపావళి పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. పూల లోడ్లతో వాహనాలు మార్కెట్‌కు వస్తుండటంతో పిల్లర్ నంబర్ 75, 59 యూటర్న్ వద్ద రాకపోకలు నెమ్మదించాయి.
లక్ష్మీనగర్ నుంచి మార్కెట్ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ మందగించింది. వాహనదారులు ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

