వార్తలకు తిరిగి వెళ్లండి
పెళ్లి చేసుకున్న మాజీ ఎంపీ

బెంగాలీ నటి, మాజీ ఎంపీ మిమి చక్రవర్తి కోల్‌కతాలోని తన నివాసంలో సిద్ధార్థ దత్తాను వివాహం చేసుకున్నారు. నవంబరు 26న పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.
ఈ జంట కోల్‌కతాలో చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసుకున్నారు. డిసెంబరు 3 నుంచి కలింపాంగ్‌లో సంప్రదాయ బెంగాలీ వేడుకలు జరగనున్నాయి. సిద్ధార్థ సముద్రయాన రంగంలో మెరైన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
Comments
Loading comments...
