Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్య కార్మికుడి నిజాయతీ

Follow Ushodayam on Google
Udayam Desk Nov 08, 2026 5:54 AM జాతీయంGeneral
పారిశుద్ధ్య కార్మికుడి నిజాయతీ - Ushodayam
రైలులో దొరికిన రూ.70 వేల విలువైన ఐఫోన్‌ను పారిశుద్ధ్య కార్మికుడు సూరి నిజాయతీగా రైల్వే పోలీసులకు అప్పగించాడు. చెన్నై సెంట్రల్‌ నుంచి గుమ్మిడిపూండి వెళ్లే సబర్బన్‌ రైలులో విధులు నిర్వహిస్తుండగా ఈ ఫోన్‌ను గుర్తించాడు. ఫోన్‌ పోగొట్టుకున్న నరేంద్రకుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి ఆయనకు ఫోన్‌ను తిరిగి అందించారు. సూరి నిజాయతీని పోలీసులు, ప్రయాణికులు అభినందించారు.

Comments

G
Loading comments...