Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ వల్లే కశ్మీర్‌ అంశం సజీవం: ఫరూఖ్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 7:05 AM జాతీయంGeneral
పాక్‌ వల్లే కశ్మీర్‌ అంశం సజీవం: ఫరూఖ్‌ - Ushodayam
పాకిస్తాన్‌ అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించడం వల్లే కశ్మీర్‌ అంశం సజీవంగా ఉందని జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. బారాముల్లాలో జరిగిన సభలో కేంద్రం కశ్మీరీలకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు. తాము భారతీయులమేనని స్పష్టం చేసిన ఆయన, హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఫరూఖ్‌ వ్యాఖ్యలను దేశద్రోహంగా అభివర్ణించిన బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది.

Comments

G
Loading comments...