Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ బందోబస్తు

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 12:58 PM ప్రకాశం General
ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ బందోబస్తు - Ushodayam
ఒంగోలు కార్పొరేషన్, చీమకుర్తి, అద్దంకి మున్సిపాలిటీల కౌంటింగ్‌కు 455 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వి. హర్షవర్ధన్‌రాజు తెలిపారు. రైజ్ కళాశాల కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు. గుర్తింపు కార్డులు ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని, సెల్‌ఫోన్లకు అనుమతి లేదని తెలిపారు. 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ అమలులో ఉన్నందున గుంపులుగా ఉండరాదని, అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...