Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక సీజన్‌ పంటలు వాయిదా వేసుకోవాలి: రేవంత్‌రెడ్డి

Follow Ushodayam on Google
Shruthi Oct 15, 2026 8:35 PM హైదరాబాద్General
ఒక సీజన్‌ పంటలు వాయిదా వేసుకోవాలి: రేవంత్‌రెడ్డి - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశమున్నందున రైతులు ఒక సీజన్‌ పంటలను వాయిదా వేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. గురువారం హైదరాబాద్‌ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రాబోయే పది నెలలు రాష్ట్రానికి కీలకమని, సాగు, తాగునీరు, విద్యుత్‌ సమస్యలు ఎదురుకావచ్చని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 20 వేల మెగావాట్లకు చేరిందన్నారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర సాయం కోరతామని తెలిపారు.

Comments

G
Loading comments...