Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NHM ఉద్యోగులపై వివక్ష సరికాదు: గడల శ్రీనివాసరావు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 2:43 PM హన్మకొండ General
NHM ఉద్యోగులపై వివక్ష సరికాదు: గడల శ్రీనివాసరావు - Ushodayam
హన్మకొండ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట 11వ రోజు కొనసాగుతున్న NHM ఉద్యోగుల నిరసన ధర్నాకు జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. ఉద్యోగులపై ప్రభుత్వం చూపుతున్న వివక్ష సరికాదని ఆయన అన్నారు. NHM ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతిరోజూ నిరసనకు సంఘీభావం తెలిపి పాల్గొంటామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...