Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాలలో తగ్గిన ధాన్యం ధర.. రైతులకు నష్టం

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 9:48 AM జగిత్యాలGeneral
మల్యాలలో తగ్గిన ధాన్యం ధర.. రైతులకు నష్టం - Ushodayam
మల్యాల మండలంలో వరికోతలు ఊపందుకోవడంతో పొలాల వద్దే దళారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. గతంలో క్వింటాలుకు రూ.3,500 వరకు చెల్లించగా, ప్రస్తుతం రూ.2,400 మాత్రమే ఇస్తున్నట్లు సమాచారం. కోతలు పూర్తికాగానే ధాన్యం విక్రయించాల్సిన పరిస్థితుల్లో రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. బియ్యం ధరలు పెరుగుతున్నప్పటికీ, ధాన్యానికి గిట్టుబాటు ధర లభించక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...