Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపూర్‌ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 2:46 PM జగిత్యాలGeneral
కొండాపూర్‌ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ - Ushodayam
మేడిపల్లి మండలం కొండాపూర్‌ గ్రామంలోని ఎంపీపీఎస్‌ పాఠశాలను మంగళవారం ఎంఈఓ లక్ష్మీనరసయ్య తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, బోధన తీరును పరిశీలించి విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. విద్యార్థులందరికీ అర్థమయ్యేలా బోధించాలని, చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...