Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంచిరావుపల్లి బస్టాండ్‌లో ఆగని బస్సులు

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 2:36 PM వనపర్తిGeneral
కంచిరావుపల్లి బస్టాండ్‌లో ఆగని బస్సులు - Ushodayam
పెబ్బేరు మండలం కంచిరావుపల్లి బస్టాండ్‌ వద్ద వనపర్తికి వెళ్లే ఆర్టీసీ బస్సులు ఆగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం జంక్షన్‌ కావడంతో నిత్యం పలువురు బస్సుల కోసం వేచి ఉంటున్నారు. కొన్ని బస్సులు బస్టాండ్‌లో ఆగకుండా దూరంగా నిలుపుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి అన్ని బస్సులు బస్టాండ్‌లోనే ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...