Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలమండలి అధికారి కారులో రూ.2.40 లక్షలు స్వాధీనం

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 2:01 PM హైదరాబాద్General
జలమండలి అధికారి కారులో రూ.2.40 లక్షలు స్వాధీనం - Ushodayam
హైదరాబాద్‌ జలమండలి జాయింట్‌ డైరెక్టర్‌ ఎ.శ్రీనివాస్‌ కారులో లెక్కల్లో చూపని రూ.2.40 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి రాజ్‌భవన్‌ రోడ్డులోని మెట్రో రెసిడెన్సీ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు నగదును గుర్తించారు. శ్రీనివాస్‌ వివరణపై సంతృప్తి చెందకపోవడంతో అవినీతి కోణంలో విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...