Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో నేటి నుంచే కొత్త పింఛన్ల అందజేత

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 7:19 AM హైదరాబాద్General
తెలంగాణలో నేటి నుంచే కొత్త పింఛన్ల అందజేత - Ushodayam
తెలంగాణలో అర్హులైన 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్ల పంపిణీ నవంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత, కల్లుగీత కార్మికులకు ఈ పథకం వర్తించనుంది. ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల నుంచే పింఛన్ సొమ్ము అందనుంది.

Comments

G
Loading comments...