వార్తలకు తిరిగి వెళ్లండి
HCU విద్యార్థినిని కాపాడిన గచ్చిబౌలి పోలీసులు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యాయత్నానికి సిద్ధమైన 21 ఏళ్ల విద్యార్థినిని గచ్చిబౌలి పోలీసులు కాపాడారు. విద్యార్థిని కనిపించడం లేదని, సూసైడ్ నోట్ రాసిందని స్నేహితుడు డయల్-100కు సమాచారం ఇచ్చాడు.
వెంటనే హాస్టల్‌కు చేరుకున్న పోలీసులు మూడో అంతస్తు నుంచి దూకకుండా అడ్డుకున్నారు. అనంతరం ధైర్యం చెప్పి, కౌన్సెలింగ్, సంరక్షణ కోసం యూనివర్సిటీ వెల్ఫేర్ టీమ్‌కు అప్పగించారు.
Comments
Loading comments...
