Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరారైన జీవిత ఖైదీ 24 గంటల్లోనే అరెస్ట్

Follow Ushodayam on Google
Ravi Singh Jun 13, 2026 7:03 AM కడపGeneral
పరారైన జీవిత ఖైదీ 24 గంటల్లోనే అరెస్ట్ - Ushodayam
విశాఖ మానసిక ఆసుపత్రి నుంచి తిరిగొస్తూ తప్పించుకున్న జీవిత ఖైదీ సాకే రాజ్‌కుమార్‌ను కడప పోలీసులు 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసులో శిక్ష పడిన ఇతడు, గూడూరు రైల్వేస్టేషన్ వద్ద భద్రతా సిబ్బంది కళ్లుగప్పి పరారయ్యాడు. ఖైదీ కోసం కడప ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. ప్రొద్దుటూరు శివారులో సంచరిస్తుండగా శుక్రవారం అతడిని పట్టుకుని, తిరిగి కడప కేంద్ర కారాగారానికి తరలించారు.

Comments

G
Loading comments...