Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. భారీ వర్షాల హెచ్చరిక

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 9:43 AM విజయనగరంGeneral
ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. భారీ వర్షాల హెచ్చరిక - Ushodayam
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ బుధవారానికి అతి తీవ్ర తుపానుగా బలపడి, మధ్యాహ్నానికి బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 115–125 కి.మీ., గరిష్ఠంగా 140 కి.మీ. వేగంతో గాలులు వీచవచ్చని హెచ్చరించింది. ఏపీలో ఐదు రోజులపాటు భారీ వర్షాలు, 27, 28 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

Comments

G
Loading comments...