Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ పెట్టుబడులు భారీగా.. ఆదాయం తక్కువే: నిఖిల్‌ కామత్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 9:15 PM జాతీయంవాణిజ్యం
ఏఐ పెట్టుబడులు భారీగా.. ఆదాయం తక్కువే: నిఖిల్‌ కామత్‌ - Ushodayam
ఏఐ రంగంలో భారీ పెట్టుబడులకు తగ్గ ఆదాయం రావడం లేదని వ్యాపారవేత్త నిఖిల్‌ కామత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీటీవీ వరల్డ్‌ సమ్మిట్‌లో మాట్లాడుతూ ఏటా ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తున్నా, ఆదాయం 100 నుంచి 200 బిలియన్‌ డాలర్లేనని తెలిపారు. ఈ అంతరం కొనసాగితే వచ్చే ఏడాది ఏఐ కంపెనీలకు నిధుల సమీకరణ కష్టమవుతుందని హెచ్చరించారు. అయితే ఏఐతో ఉత్పాదకత పెరిగి ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశముందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...