Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుండపోతలోనూ గర్భిణికి 108 సిబ్బంది ప్రసవం

Follow Ushodayam on Google
Anuroop Sep 24, 2026 9:49 AM అల్లూరి General
కుండపోతలోనూ గర్భిణికి 108 సిబ్బంది ప్రసవం - Ushodayam
అల్లూరి జిల్లా వై.రామవరం మండలం జంగలతోటలో గర్భిణి సంజనకు 108 సిబ్బంది సురక్షిత ప్రసవం నిర్వహించారు. అడ్డతీగలకు చెందిన ఈఎంటీ అశోక్, పైలట్ ప్రసాద్ కుండపోత వర్షాన్ని లెక్కచేయకుండా గ్రామానికి చేరుకున్నారు. మార్గమధ్యలో అడ్డుగా ఉన్న భారీ చెట్టును తొలగించి ముందుకు సాగారు. పరిస్థితి విషమించడంతో అక్కడే ప్రసవం నిర్వహించి తల్లీబిడ్డను కాపాడారు.

Comments

G
Loading comments...